ట్రినిడాడ్ టెస్ట్: ఇండియా బ్యాటింగ్ … మహమ్మద్ సిరాజ్ స్థానంలో యంగ్ పేసర్ !

-

వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న ఇండియా మొదటి టెస్ట్ ను ఇన్నింగ్స్ తేడాతో గెలుచుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ రోజు రెండవ టెస్ట్ లో బరిలోకి దిగుతోంది. కాగా కాసేపటి క్రితం టాస్ ఓడిపోయిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటగా బ్యాటింగ్ చేయనున్నాడు… గత మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ జట్టు బ్యాటింగ్ తీఉస్కోగా , ఈ టెస్ట్ లో మాత్రం బౌలింగ్ తీసుకుని ఆశ్చర్యపరిచింది. కాగా గత మ్యాచ్ లో ఓడిపోయిన వెస్ట్ ఇండీస్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనీ భావిస్తోంది. అందుకే రెండు కీలకమైన మార్పులను చేసింది కైల్ మేయర్స్ మరియు రాకీ కార్నివాల్ స్థానంలో క్రీక్ మెకంజీ మరియు షానన్ గాబ్రియేల్ ను తీసుకుంది. ఇక ఇండియా కూడా ఒక మార్పును చేయడం గమనార్హం. తెలుగోడు మహమ్మద్ సిరాజ్ కు కాలి గాయం అయిన కారణంగా అతని స్థానంలో యంగ్ పేసర్ ముఖేష్ కుమార్ ను ఆడించనుంది.

 

కాగా కెరీర్ లో అతనిది తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. మరి ముఖేష్ కుమార్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా ? అన్నది తెలియాలంటే వెస్ట్ ఇండీస్ జట్టు బ్యాటింగ్ చేసే వరకు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version