నటి త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ సినీ పరిశ్రమను తన సినిమాలతో రఫ్ఫ్ఫాడించింది. తన నటనకు ఎంతగానో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. త్రిష తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకుని అవార్డులను అందుకుంది. ఇప్పటికి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అవార్డులను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా త్రిష సైమా అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. అందులో త్రిషకు సైమా అవార్డు వరించింది.

అవార్డు తీసుకున్న అనంతరం నటుడు విజయ్ పై ఈ బ్యూటీ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. స్టేజ్ మీద ఉన్న సమయంలో విజయ్ ఫోటోను త్రిషకు చూపించగా ఆ సమయంలో త్రిష ఎంతో సిగ్గుపడుతూ కనిపించారు. అతని న్యూ జర్నీలో అంతా మంచే జరగాలి అతను కోరుకున్నవన్నీ నిజం కావాలి. ఎందుకంటే అతను దానికి అర్హుడు అంటూ త్రిష ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని మరోసారి జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. గతంలోనూ వీరిద్దరూ వివాహం చేసుకుంటారని సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారు అంటూ అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయం పైన ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇప్పుడు త్రిష చేసిన ఈ కామెంట్లు చూసిన అనంతరం వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారని అర్థమవుతుంది.