భట్టి విక్రమార్క బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తూ మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ. 30,000 కోట్లు బ్యాంకులలో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలను ఇవ్వండని బ్యాంకర్లను రిక్వెస్ట్ చేశారు భట్టి విక్రమార్క.

ఆస్తుల తాకట్టు, ఎఫ్డీలు చేయాలంటూ రైతులను ఒత్తిడి చేయకండని భట్టి విక్రమార్క కోరారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. కొంతమంది రైతులకు సకాలంలో రుణాలు అందడం లేదని రైతులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పైన భట్టి విక్రమార్క స్పందిస్తూ తనదైన రీతిలో బ్యాంకర్లను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయం పైన బ్యాంకర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.