ఫిబ్ర‌వ‌రి నుంచి టైమ్ ఫిక్స్ చేశారా?

-

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ – యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగి దాదాపు ఏడెనిమిది నెల‌ల‌వుతోంది.

`ఆర్ ఆర్ ఆర్‌` పూర్తి చేస్తే కానీ ఎన్టీఆర్ ఈ మూవీకి డేట్స్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. దీంతో ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేలోపు త్రివిక్ర‌మ్ మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో వున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తెలిసింది. ఫిబ్ర‌వ‌రి నుంచి అ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని మొద‌లు పెట్టాల‌నుకుంటున్నార‌ట‌.

మార్చి లేదా ఏప్రిల్ లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఎన్టీఆర్ ఫిబ్ర‌వ‌రి నుంచి ఫ్రీ కాబోతున్నార‌ట‌. అందుకే ఆ నెల నుంచి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని స్టార్ట్ చేసి ప‌క్కా ప్లానింగ్‌తో షెడ్యూల్‌ని స్టార్ట్ చేయాల‌ని త్రివిక్ర‌మ్ అందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version