పవన కళ్యాణ్ పోస్టర్ పై ట్రోలింగ్

-

నిన్న అంతర్జాతీయ మహిళల దినోత్సవం. మహిళల సామాజిక, ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవలను గురించి గుర్తు చేసుకునే రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏటా మార్చి 8వ తేదీన జరుపుకునే ఈ ఉత్సవం 1911 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభమైంది. దాదాపు శతాబ్ద కాలంగా ఈ రోజున ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. లింగ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించే దిశగా ఈ రోజును జరుపుకుంటున్నారు.

మహిళల హక్కుల కోసం కొన్ని చోట్ల పాదయాత్ర కూడా చేస్తుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… మహిళల దినోత్సవం నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రభుత్వం హాలిడే ను కూడా ప్రకటించేశాయి. అటు సినీ తారలు, రాజకీయ నాయకులు మహిళల దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలామంది మహిళా దినోత్సవానికి సంబంధించిన ఫోటోలను స్టేటస్ గా కూడా పెట్టుకున్నారు.

కొంతమంది మహిళలను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంటే… మరి కొంతమందేమో మహిళలను కించపరిచేలా సెటైర్లు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టర్ లో మామూలు హీరో ఉంటే పర్లేదు కానీ… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటం… హల్చల్ గా మారింది.

ఈ పోస్టర్ వివరాల్లోకి వెళితే… గబ్బర్ సింగ్ సినిమా లో…. పవన్ కళ్యాణ్, హీరోయిన్ శృతి హాసన్ ను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ పెళ్లిలో… ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకుంటారు. ఆ ఫోటో ను తీసుకొని నెటిజన్లు ప్రస్తుతం ఉమెన్స్ డే నేపథ్యంలో ట్రోల్ చేస్తున్నారు. ,”మహిళల దినోత్సవం నేపథ్యంలో… మహిళలు సంతోషంగా ఉండి.. భర్తలను కూడా సంతోషంగా ఉంచండి” అంటూ అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ పోస్టర్ పై మీమ్స్ క్రియేట్ చేశారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version