రాజకీయ నాయకులు మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తే..ఆ మాటలు రివర్స్ అయ్యి ఆ నాయకులకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుది కూడా అదే పరిస్తితి. వరుసగా రెండుసార్లు అచ్చంపేట నుంచి గెలుస్తున్న గువ్వలకు..కాస్త దూకుడు ఎక్కువే. ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో ముందే ఉంటారు. కాస్త నోరు కూడా జారతారు. దీని వల్ల తర్వాత ఏం జరుగుతుందనేది ఆలోచించుకోరు. అందుకే ఇప్పుడు గువ్వల ఇబ్బందుల్లో పడ్డారు.
అయితే హుజూరాబాద్ ఫలితం తర్వాత గువ్వలపై పార్టీలు కాదు ప్రజలే ఎటాక్ మొదలైంది. ఎప్పుడు రాజీనామా చేస్తారని ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ఇక వారిపై గువ్వల బూతుపురాణం ఎత్తుకుంటున్నారు. పైగా తన ఛాలెంజ్‌ని ఎవరూ స్వీకరించలేదు కాబట్టి, తాను రాజీనామా చేయనని బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు.
అయితే ఎంత బుకాయించిన గువ్వల చేసిన పనులని మాత్రం ప్రజలు మర్చిపోరనే చెప్పాలి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎన్నికల్లో గువ్వలకు చుక్కలు చూపించడానికి అచ్చంపేట ప్రజలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు గెలిచి సొంత నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేసింది లేదు…పైగా వేరే నియోజకవర్గాలకు వెళ్ళి హడావిడి చేస్తున్నారు. గువ్వల పనితీరుపై అచ్చంపేట ప్రజలు గుర్రుగానే ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గువ్వలకు గుండె గుబేలుమనే షాక్ మాత్రం ఇచ్చేలాగా ఉన్నారు. ఇక ఆ భయం గువ్వలకు ఇప్పటినుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. ఓటమి గుబులు గువ్వలకు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.