గులాబీ శ్రేణుల సంబురాలు.. టుడే సీఎం టుమారో పీఎం అంటూ ప్ల‌కార్డులు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 283 మంది సభ్యులు భారత్ రాష్ట్ర సమితి పార్టీ తీర్మానంపై సంతకం చేశారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురాలు షురూ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి.  పార్టీ కార్య‌క‌ర్త‌లు భారీ స్థాయిలో త‌ర‌లివ‌చ్చి పండుగ చేసుకుంటున్నారు.

ద‌స‌రా, దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. ఓ అభిమాని ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించారు. దేశ్ కా నేత‌.. టుడే సీఎం.. టుమారో పీఎం.. జై కేసీఆర్ స‌ర్.. జై డీఎన్ఆర్ అన్న అని ప్ర‌ద‌ర్శించిన ప్ల‌కార్డు వైర‌ల్ అవుతోంది. ఇక తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గిరిజ‌నుల నృత్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version