సాగర్ టీఆర్ఎస్ అభ్యర్దికి సొంత పార్టీలోనే పొగ బెడుతున్నారా ?

-

తెలంగాణలో సాగర్ ఉప ఎన్నిక ఆసక్తి రేపుతుంది.అధికార టిఆర్ఎస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలో ఎవర్ని నిలబెడతారనేది ఇంకా తేలలేదు.టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి పేరు కాస్త గట్టిగానే టిక్కెట్ రేసులో వినిపిస్తుంది. అయుతే ఆయనకు అవకాశం రాకుండా ప్రత్యర్ధులు కూడా అదే రేంజ్ లో పావులు కదుపుతున్నారు. మరి వీటి నుంచి బయటపడి చిన్నపరెడ్డి టికెట్ దక్కించుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది.

నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కు ఈ నెలలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.
అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల సమావేశంలో కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థిగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న తెరా చిన్నప్పరెడ్డి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సన్నిహితుల వద్ద చిన్నప్పరెడ్డి ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే అప్పట్లో చిన్నప్ప రెడ్డి బిజెపితో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ను తీవ్రంగా ఖండించారు తేర చిన్నప్ప రెడ్డి. నాగార్జున సాగర్ లో చిన్నప్ప రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నప్పటికీ జిల్లాలో కొందరు ఆయనను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. చిన్నప్ప రెడ్డికి మద్దతు ఇచ్చే నేతలను వారి వైఖరిని మార్చుకోవాలని సూచిస్తున్నారట. ఒక వైపు చిన్నప్ప రెడ్డి మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఆ ప్రయత్నాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఆయన ప్రత్యర్ధులు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో వైపు మంత్రి జగదీశ్ రెడ్డి స్థానిక నేత కోటిరెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు. అయితే బై ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటున్న చిన్నప రెడ్డి ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉండటంతో దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జరుగుతున్న నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ను టిఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంటుంది. మరి బై ఎలక్షన్ అభ్యర్థిగా ఎవరికి ఛాన్స్ వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version