కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటి మేకర్ సహా 8 సింబల్స్ తొలగించాలని టిఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హై కోర్ట్ ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరైన ఈసీ అధికారులు మునుగోడు ఉపఎన్నిక కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకిి విన్నవించారు.
ఈ సమయంలో గుర్తులు మార్చలేమని చెప్పారు. ఈసీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేని స్పష్టంం చేసింది. టిఆర్ఎస్ వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతోనే.. ఏదో ఒక వంకతో ఎన్నికను ఆపాలని టిఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు.