మంత్రి శ్రీనివాస్​గౌడ్ షాక్‌…చంపేందుకు కుట్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత​ ఫిర్యాదు

-

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాడు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉందని తెరాస కుసి చెందిన మహబూబ్ నగర్, రాం నగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు. సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్ కు, స్థానిక కలెక్టర్, అధికారులకు పిర్యాదు చేసినందుకు కక్ష్య తీర్చుకొనేందుకు పోలీసులతో కుమ్మకై వేధిస్తున్నారని బాధితుని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి నన్ను హత్య చేయించాలని చూస్తున్నాడని… తనకు ప్రాణ రక్షణ కల్పించాలని హెచ్చార్సీని వేసుకున్న కౌన్సిలర్… మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మొర పెట్టుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకొని… తనకు ప్రాణ రక్షణ కల్పించాలని హెచ్ ఆర్సీని వేడుకున్నారు టీఆర్‌ ఎస్‌ పార్టీ కౌన్సిలర్. అయితే.. దీనిపై హెచ్‌ ఆర్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version