మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక సమీపంలో మారనాయుధాలతో దాడిచేసి కిరాతకంగా వార్డు కౌన్స్ లర్ రవిని హతమార్చిన కేసు ను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు… ఈ కేసు లో భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్,అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్ లు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారుుు పోలీసులు..
ఇక వారి వద్ద నుంచి మారునాయుధాలు గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలకు అడ్డు పడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టి ఇస్తున్న కారణంగానే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ వెల్లడించారు.
ఈ హత్య లో విజయ్, అరుణ్ ప్రధాన నిందితులు, మిగిలిన ఐదుగురు వారికి సహకరించినారు.బానోతు రవి తో గతంలో అక్రమ వ్యాపారాలు కలసి చేశారని ఇప్పుడు వీరు స్వతహాగా తమకు తామే వ్యాపారాలు రవితో విడిపోయి వ్యాపారాలు కలప, బియ్యం వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.