టీఆర్ఎస్ కౌన్సిలర్ హత్య…. ఆర్థిక లావాదేవీలతోనే హత్య చేశారన్న జిల్లా ఎస్పీ

-

మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబాబాద్ పట్టణంలోని 8 వార్డ్ కౌన్సిలర్ గా ఉన్న బానోత్ రవిని కాపు కాసి హత్య చేశారు దుండగులు. పత్తిపాకలో తన కొత్తింటి నిర్మాణ పనులు చూసుకుని బైక్ పై బయలుదేరిన రవిని ట్రాక్టర్ అడ్డుపెట్టి గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవిని ఏరియాసుపత్రికి తరలించగానే మరణించాడు. ఈ ఘటనలో అప్రమత్తం అయిన పోలీసులు 4 టీములను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారని… ఇప్పటికే ఇద్దరిని గుర్తించామని… ఇది రాజకీయ హత్య కాదని, ఆర్థిక లావాదేవీల కారణమని ప్రాథమికంగా నిర్థారించామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. 

ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, కుటుంబ సభ్యలతో మాట్లాడారు. ప్రాథమికంగా రాజకీయ హత్య కాదని నిర్ణయించుకున్నారు. దాడి చేసిన వెంటనే ఘటన స్థలం నుంచి నిందితులు పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. కొద్దిరోజులుగా కొంత‌మంది నేత‌ల‌తో బానోతు ర‌వినాయ‌క్ తీవ్రంగా విభేదిస్తూ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని కూడా స్వ‌యంగా కొంత‌మంది త‌న స‌న్నిహితుల‌తో ర‌వినాయ‌క్ పేర్కొన్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే ర‌వినాయ‌క్ హ‌త్య‌కు గురికావ‌డం గ‌మ‌నార్హం. ర‌వినాయ‌క్‌కు భార్య పూజ, ముగ్గురు పిల్ల‌లున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version