వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను రాజకీయం కోసం వాడుకుంటున్నారని… ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ ఆట… అందుకు జీవితాంతం ఓటేయాలట అంటూ ఎద్దేవా చేసింది. అయ్యా కేటీఆర్ కోట్లాడి మంది ఆకాంక్షిస్తే, వేలమంది ఉద్యమిస్తే, వందల మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందంటూ… వేలాది మంది తమ ఆస్తుల్ని త్యాగం చేసుకుంటే తెలంగాణ వచ్చిందంటూ వ్యాఖ్యానించింది.
ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోంది: వైెఎస్ షర్మిళ
-