నవంబర్ 29, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ పేజీ రాసుకున్న రోజు. ‘తెలంగాణ తెచ్చుడో, కెసిఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29 న కెసిఆర్ ఆమరణ దీక్షకు దిగారు. కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దీక్షా స్థలికి వెళ్తుండగా, మానేరు బ్రిడ్జి అలుగునూరు వద్ద కేసీఆర్ ను అరెస్టు చేశారు.
ఖమ్మం జైలుకి తరలించగా, 11 రోజులు దీక్ష చేశారు. నేటికీ 13 ఏళ్లు కాగా, టిఆర్ఎస్ నేడు దీక్ష దివాస్ గా నిర్వహిస్తోంది. ఉద్యమాల గడ్డ వరంగల్ లో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్. బిజెపి చీఫ్ బండి సంజయ్ పై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ది అహంకార యాత్ర అని.. పాదయాత్రతో సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్.