ఈటెల నేను నీలా సగం సగం కాదు: మంత్రి కౌంటర్

-

మాజీ మంత్రి ఈటెల రాజేందర్  మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై చేసిన విమర్శలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. నేను బిడ్డా అంటే తట్టుకోలేవ్ అని అన్నారు. నీ బెదిరింపులు ఆపు రాజేందర్ అంటూ హెచ్చరించారు. నా వెంట్రుక కూడా పీకలేవు అన్నారు. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టను అని కరీంనగర్ బొందల గడ్డ అయితే మంత్రిగా ఉండి ఎందుకు ఆపలేదు అని నిలదీశారు.

నేను నిజాయితీగా టాక్స్ కట్టిన తప్పని తేల్చితే.. ఐదు రేట్లు ఎక్కువ కడతా అంటూ ఆయన స్పష్టం చేసారు. నేను నీలాగా సగం బీసీ, సగం ఓసీ కాదు అని అన్నారు. రాజకీయాల్లో నా ఆస్తులు కరిగాయి.. నీ ఆస్తులు పెరిగాయి అని ఆయన ఆరోపించారు. నీది ఆత్మ గౌరవమా.. ఆత్మ వంచననా ? అని నిలదీశారు. నీలా దేవాలయాల భూములు కొనలేదు అని అన్నారు. కేసీఆర్ కు 55 సీట్లకు మించి రావొద్దని కోరుకున్నావ్… నా మీద విషం పెట్టుకున్నావ్ అని మండిపడ్డారు

Read more RELATED
Recommended to you

Exit mobile version