మహోన్నత లక్ష్యంతో సీఎం సాహోసోపేత నిర్ణయం : దానం నాగేందర్‌

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలో దళితబంధు తొలివిడతలో భాగంగా ఎంపికైన 100మంది లబ్ధిదారుల్లో రవాణ వాహనాలను ఎంచుకున్న వారికి బుధవారం జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వాహనాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. సమాజంలో అణిచివేయబడిన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా వారిని ఎదిగేలా చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని రూపొందించారని ఆయన అన్నారు.

సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఉన్నతస్థాయిలోకి తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో సీఎం సాహోసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు దానం నాగేందర్‌. హుజురాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు పథకం ప్రారంభించారని నోటికి వచ్చినట్లు మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల నోరు మూతపడిందన్నారు దానం నాగేందర్‌. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుచేస్తున్నారన్నారు దానం నాగేందర్‌. తొలివిడతలో 100మందికి దళితబంధు పథకాన్ని అందిస్తున్నామన్నారు దానం నాగేందర్‌. ఇప్పటికే లబ్ధ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని, కాగా రెండో విడతలో మరో 1500మందికి దళితబంధు అందిస్తామని దానం నాగేందర్‌ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version