నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,807 టీజీటీ పోస్టులు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కొన్ని టీచర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. వాటి కోసం అర్హత, ఆసక్తి వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB భారీగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 5,807 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని ప్రకటించింది.

 

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… 2021 జూలై 3 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. పూర్తి వివరాలని https://dsssb.delhi.gov.in/ లో తెలుసుకో వచ్చు. అభ్యర్థులు https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాల లోకి వెళితే… మొత్తం ఖాళీలు- 5,807 వున్నాయి. టీజీటీ సంస్కృతం ఫీమేల్- 1,159, టీజీటీ సంస్కృతం మేల్- 866, టీజీటీ ఇంగ్లీష్ మేల్- 1,029, టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్- 961,
టీజీటీ ఉర్దూ ఫీమేల్- 571, టీజీటీ ఉర్దూ మేల్- 346, టీజీటీ పంజాబీ ఫీమేల్- 492, టీజీటీ పంజాబీ మేల్- 382, టీజీటీ బెంగాలీ ఫీమేల్- 1.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ లో కనీసం 45 శాతం మార్కులతో పాస్ కావాలి.
వయస్సు 32 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. టైయర్ 1, టైయర్ 2 ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version