వరి ధాన్యం కొనుగోలుపై పోరుకు టీఆర్ఎస్ పార్టీ సిద్దమైంది. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనుంది. గత కొంత కాలంగా వరి కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ లో కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని… బీజేపీ నేతలను బయట తిరుగనీయం అని హెచ్చిరించారు. కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఒత్తడి తీసుకువచ్చేలా ధర్నా చేయనుంది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో కార్యకర్తలు పాల్గొననున్నారు. ధర్నా, ఆందోళనల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇందుకోసం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక నాయకులతో ఆందోళన కార్యక్రమాలపై సమీక్షించారు.