హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశం నేడే జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నగరం లో ఎక్కడ చూసినా టిఆర్ఎస్ ప్లెక్సీలు…హోర్డింగులే కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ముఖ్యనేతలు అంతా సమావేశం నిర్వహించే హైటెక్స్ కు చేరుకుంటున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఆరువేల మంది ప్రజా ప్రతినిధులను ఆహ్వానించింది. అంతే కాకుండా వచ్చేవారు డ్రెస్ కోడ్ లో రావాలని స్పష్టం చేసింది.
ఇక కార్యక్రమం షెడ్యూల్ చూసినట్లయితే…ఉదయం 11 గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభం కానుంది. మొదట పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా ఇటీవల మరణించిన 11మంది పార్టీ నేతలకు సంతాపం ప్రకటిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఆ తరవాత కేసీఆర్ ప్రసంగం లో తీర్మానాలపై చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం చేసి కేసీఆర్ స్పీచ్ తో సభకు ముగింపు పలుకుతారు.