తూర్పుగోదావరి జిల్లా మురముండ గ్రామానికి ఓ యువతితో ములుగు జిల్లాకు చెందిన ఓ యువకుడితో పెళ్లి జరగ్గా ఆ వివాహానికి సీతక్క హాజరయ్యారు. యువకుడి ఆహ్వానం మేరకు సీతక్క పెళ్లికి వచ్చారు. ఈ సంద్భంగా సీతక్క మాట్లాడుతూ…. ఆంధ్రా అతిథి మర్యాదలకు పెట్టింది పేరు అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడి ఆచారాలు సంప్రదాయాలు అంటే తనకు గౌరవమని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉందని రహదారులు మాత్రం అద్వానం గా ఉన్నాయని చెప్పారు.
అంతే కాకుండా టిడిపి ఆఫీస్ లపై జరిగిన దాడులను సీతక్క ఖండించారు. అధికారం శాశ్వతం కాదు అని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు నియంతృత్వ దోరణి తో వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న పరిణామాల పై మంత్రి కేటీఆర్ సీఎం జగన్ కు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం ను పట్టుకుని ఆ భూతులు ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా ఇప్పుడు సీతక్క టీడీపి కి సపోర్ట్ చేయడం ఆసక్తిగా మారింది.