త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని రాజకీయ కోకిల చంద్రబాబు ఎప్పటి నుంచో కూస్తూ వస్తున్నారు. అసలు కేంద్రం ఆ రాగం అందుకోక ముందే ఏపీలో చంద్రబాబు హడావుడి చేస్తూ వచ్చారు. అయితే అదంతా టిడిపి శ్రేణులను ఉత్సాహపరిచేందుకు, వారిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చి వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు మాత్రమే అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్క డా తగ్గలేదు. 2022 లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు వస్తాయని నమ్మకంగా అప్పటి నుంచి ఇప్పటివరకు చెబుతూనే ఉన్నారు. ఇక బాబు చెప్పినట్లుగానే కేంద్రం కూడా జమిలి ఎన్నికలు ఉండవచ్చు అనే సంకేతాలను ఇస్తూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జమిలి ఎన్నికల జపం అప్పుడు చేస్తూ వస్తుండడంతో బాబు చెప్పింది నిజమే అనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది.
ముందు నుంచి జమిలి ఎన్నికల జపం చేస్తున్నన టిడిపి కి ఫలితం అంతంత మాత్రంగానే ఉండేటట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు గతంలో ఉన్నంత యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలపైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కువగా హైదరాబాద్ లోని నివాసానికి పరిమితమై పోతున్నారు. వయసు రీత్యా, ఆరోగ్యరీత్యా ఇలా ఎలా చూసుకున్నా పెద్దగా ప్రచారానికి రాలేరు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు నిరాశ నిస్పృహల్లో ఉన్నాయి. బలమైన నాయకులంతా ఇతర పార్టీలలోకి జంపు చేసేశారు. ఇటీవల పార్టీ కమిటీలను నియమించినా, పేరు కు పదవులు తప్ప పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.లోకేష్ ప్రభావం కూడా అంతంత మాత్రమే ఉండడం వంటి వ్యవహారాలతో జమిలి ఎన్నికలు వస్తే టిడిపి ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేనట్టుగానే ఆ పార్టీలో పరిస్థితి ఉంది.
ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే 2014, 2018 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ వరుసగా విజయాలు నమోదు చేసుకుంది. తెలంగాణ ఏ ఎన్నికలు జరిగినా, గులాబీ జెండా తప్ప మరే జెండా ఎగిరే అవకాశం లేదు అన్నట్లుగా పరిస్థితిని కల్పించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని, దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి, గ్రేటర్ లో బిజెపి టిఆర్ఎస్ ఫలితాలు దగ్గర దగ్గర గా ఉండడం, అనూహ్యంగా బిజెపి బలం పుంజుకోవడం వంటి వ్యవహారాలతో పాటు, పార్టీ నాయకుల్లో అలుముకున్న అసంతృప్తి, అసహనం ప్రజావ్యతిరేకత ఎదుర్కోవడం ఇలా ఎన్నో అంశాలతో టిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ను పక్కకు నెట్టి బిజెపి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. టిఆర్ఎస్ సవాల్ విసిరే స్థాయికి బిజెపి ఎదిగింది. ఆ పార్టీ నాయకులు అందరూ సమిష్టిగా పార్టీకి విజయాన్ని అందించేందుకు కృషి చేస్తున్న తీరు బిజెపి బాగా కలిసి వస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా, ఇలా ఎలా చూసుకున్నా, ఏపీలో టీడీపీ ,తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలకు విజయం అనేది జమిలి ఎన్నికలలో అందని ద్రాక్షగానే కనిపిస్తోంది.