జీవితంలో ఎదగాలనుకుంటున్నారా? ఐతే రాత్రిపూట ఈ అలవాట్లు అలవర్చుకోండి..

-

ఆరోగ్యం బాగుండాలంటే రోజులో కనీసం 6 నుండి 8గంటలైనా నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం సమస్యలు తలెత్తుతాయి. ఐతే చాలా మంది రాత్రిపూట నిద్రపోకుండా పనిచేసి తెల్లారక పడుకుంటారు. నైట్ షిఫ్ట్ పనులు వచ్చాక ఇది మరీ ఎక్కువైపోయింది. కొందరేమో రాత్రిపూట జాబ్స్ కారణంగా నిద్రపోకుండా ఉంటే, మరికొందరేమో కావాలనే రాత్రి పూట మెలుకువగా ఉంటారు. ఐతే వారందరి గురించి పక్కన పెడితే, నిద్రపోయే ముందు చేయకూడని పనులేమిటో ఈ రోజు తెలుసుకుందాం.

రాత్రి 10గంటలు మోగగానే ఫోన్ ని పక్కన పెట్టేయండి. సోషల్ మీడియా పేజీల్లో వెతుకుతూ సమయం వృధా చేసుకోవద్దు. దానివల్ల నిద్రా సమయం తగ్గుతుంది. అదీ గాక మీవద్ద నుండి కనీసం ఏడు అడుగుల దూరంలో ఫోన్ ని ఉంచండి. రెడియేషన్ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.

పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అస్సలు మరువద్దు. రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమమైన పద్దతి.

రాత్రిపూట డిన్నర్ తొందరగా ముగించండి. భోజనం చేసిన తర్వాత కనీసం 20నిమిషాలైనా నడవాలి. ఆలస్యంగా తిని, ఆ వెంటనే పడుకుంటే లావుగా అవడమే కాకుండా రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.

బెడ్ పైకి చేరగానే అన్ని బాధాలని మర్చిపోవాలి. మీరెప్పుడైతే విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారో, అప్పుడే అన్నింటినీ పక్కన పెట్టేయాలి. కోపంగా ఉన్నప్పుడు నిద్రపోవాలని ప్రయత్నించకండి.

రేపేం చేయాలనుకుంటున్నారో ఒక్కసారి తలచుకోండి. దీనివల్ల పొద్దున్న లేవగానే గజిబిజి కాకుండా ప్రశాంతంగా ఉంటుంది.

ఒక పుస్తకంలోని కనీసం పది పేజీలైనా చదవండి. రాసే అలవాటు ఉంటే, ఒక రెండు పేజీలైనా రాయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version