హెల్మెట్ లేదని ట్రక్ డ్రైవర్ కు వెయ్యి రూపాయల ఫైన్

-

ఒడిశాలో రవాణా శాఖ నిర్లక్ష్యం మళ్ళీ బయట పడింది. హెల్మెట్ ధరించకుండా ట్రక్కును నడుపుతున్నాడనే నెపంతో వ్యక్తికి వెయ్యి రూపాయల చలానా వేయడం సంచలనంగా మారింది.  ఈ కేసు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందినది. డ్రైవర్ ప్రమోద్ కుమార్ తన ట్రక్కు అనుమతి పునరుద్ధరించడానికి ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళినపుడు ఇది బయటపడింది. ఇది రవాణా శాఖ నిర్లక్ష్యం అయినప్పటికీ, ట్రక్ డ్రైవర్ చలాన్ డబ్బులు కట్ట వలసి వచ్చింది. 

ట్రక్ డ్రైవర్‌కు చలాన్ గురించి తెలియదు

ప్రమోద్ కుమార్ అనే ట్రక్ డ్రైవర్ చలాన్ ఎందుకు విధించారో తెలియదు. అతను తన ట్రక్ పర్మిట్ పునరుద్ధరించడానికి రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నప్పుడు, అతని ట్రక్ యొక్క చలాన్ పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు అధికారులు. ట్రక్ నెంబర్ OR-07W / 4593 కోసం చలాన్ చెల్లించాలని అధికారులు తెలిపారు. ఈ చలాన్ ఎందుకు విధించబడిందని అని ప్రమోద్ అడిగిన తర్వాత, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం వల్ల 1000 రూపాయల చలాన్ను విదించామని అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేసినందుకు చలాన్ ఎందుకు కట్టాలని ప్రమోద్ రవాణా శాఖ అధికారులను ప్రశ్నించాడు. అయితే అధికారులు అతని మాటలు ఏవీ వినలేదు చలాన్ సమర్పించిన తర్వాత మాత్రమే అతని ట్రక్ కి అనుమతి పునరుద్ధరించబడుతుంది అని చెప్పారు. దీంతో డ్రైవర్ చలాన్ కట్టాల్సి వచ్చింది. గత మూడు సంవత్సరాలుగా ట్రక్కును నడుపుతున్నానని, నీరు సరఫరా చేస్తున్నానని ప్రమోద్ చెప్పాడు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version