మియామి ఈవెంట్లో డ్యాన్స్ చేసిన ట్రంప్..వీడియో వైరల్

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత డేంజర్ నిర్ణయాలు తీసుకుంటారో ప్రపంచదేశాలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన అన్ని దేశాలపై సుంకాలు విధించారు. ఈ దెబ్బకు అటు అమెరికాలోనే కాకుండా అగ్రదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి. చైనా మీద ఏకంగా 120శాతానికి పైగా సుంకం వేసి తానెంటో మరోసారి నిరూపించుకున్నారు.

అయితే, ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేస్తుంటారని ఆయన వర్గీయులు చెబుతుంటారు. ఎప్పుడూ సరదగా ఉండే ట్రంప్ ..ప్రభుత్వ నిర్ణయాల్లో మాత్రం కఠువుగా వ్యవహరిస్తుంటారు. కాగా, మియామిలో జరిగిన UFC 314 ఈవెంట్‌కు ట్రంప్ హాజరయ్యారు. అభిమానులు ట్రంప్ క్యాప్‌లతో ఘన స్వాగతం పలికారు.ఈ క్రమంలోనే ట్రంప్ తన అభిమానులతో డాన్స్‌ చేశారు. ఎలాన్ మస్క్, కెన్నెడీ జూనియర్, గబ్బార్డ్ తదితరులు సందడి చేశారు.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మళ్లీ స్వర్ణయుగం వచ్చినట్లుందని ఆనందం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news