మనోజ్‌ను చూసి మంచు లక్ష్మి ఎమోషనల్.. వీడియో వైరల్

-

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య పెద్దఎత్తున గొడవలు జరుగుతున్నాయి. వీరి తండ్రి మోహన్ బాబు సైతం మంచు విష్ణుకు మద్దతుగా నిలిచారు. దీంతో మనోజ్ తనకు న్యాయం చేయాలని.. జల్ పల్లిలోని ఇంట్లో తన వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకునేందుకు చాన్స్ ఇవ్వాలని ఇటీవల ఆ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

తాజాగా హైదరాబాద్‌ వేదికగా ప్రతి ఏడాది సెలబ్రిటీ ఫ్యాషన్‌ షో జరుగుతుంటుంది. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో తన సోదరిని సర్‌ప్రైజ్‌ చేస్తూ నటుడు మనోజ్‌ ఆయన సతీమణి మౌనిక పాల్గొన్నారు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్‌ అయ్యారు. ఆయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news