ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్ష పదవి దిగి పోవడానికి సిద్ధంగా ఉన్న ట్రంప్ కి మరో భారీ షాక్ తగిలింది. అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ కు ఈ ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానించింది. ట్రంప్ మీద ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రజా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ మీద ప్రవేశ పెట్టిన అభిశంసన ప్రక్రియకు అనుకూలంగా 231 ఓట్లు పోలయ్యాయి. అలాగే దానికి వ్యతిరేకంగా కేవలం 197 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఇక అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. ఇక తన మద్దతుదారులకు ట్రంప్ వీడియో సందేశం విడుదల చేశారు. అమెరికన్ లు ఐక్యంగా ఉండాలని హింసను నివారించాలని ఆ వీడియోలో తన అభిమానులను కోరారు. ఇక అభిశంసన తరువాత ఈ నెల 20లోగా సెనేట్ ట్రంప్ పై విచారణకు ఆదేశించే అవకాశాలు లేవు. ఆ లెక్కన ట్రంప్ తన పదవీ కాలం ముగియక ముందే బలవంతంగా బాధ్యతలను వదిలేసే చాన్స్ లేదని అంటున్నారు. ఒకవేళ బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, సెనెట్ విచారణ ప్రారంభించి, ట్రంప్ దోషిగా తేలితే మాత్రం ఆయన మరో సారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు.