ఏపీలో పెద్ద ఎత్తున కోడి పందాలు.. కొట్లలోనే !

-

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాల నిర్వహణ జోరుగా సాగుతోంది. కోడి పందాలు జరక్కుండా చూడాలని హైకోర్టు ఆదేశించినా సరే ప్రజాప్రతినిధులు సమక్షంలోనే కోడిపందాలు నిర్వహిస్తుండటం గమనార్హం. కృష్ణ, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా వేల సంఖ్యలో కోడి పందాల బరులు ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో యధేచ్చగా కోడిపందాల నిర్వహణ సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 250 కి పైగా బరులు ఏర్పాటయ్యాయి. కోట్ల రూపాయల మేర డబ్బు చేతులు మారుతోంది.

వేరే ఊర్ల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు నిర్వాహకులు. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే అక్కడ కూడా కోడిపందాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కోడిపందాల కోసం ఏకంగా ఐదు వందలకు పైగా బరులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ కూడా కోట్లాది రూపాయల మేర డబ్బు చేతులు మారుతోంది. ఇక సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పేకాట జూద క్రీడలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ కోడి పందాల బరులు వద్ద ప్రైవేట్ సెక్యూరిటీతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నారు నిర్వాహకులు. మొత్తం మీద అ పోలీసులు పండుగకు ముందు కాస్త హడావిడి చేసినా పండుగ మొదలయ్యాక సైలెంట్ అయిపోయారని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version