పళ్ళు పుచ్చిపోయి ఊడిపోకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి..

-

మన చిరునవ్వు ఎంత ప్రత్యేకమైందో చెప్పక్కర్లేదు. నవ్వుతున్నప్పుడు ముత్యాల్లా పళ్ళు మెరవాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ చాలా మందికి నవ్వే అదృష్టం ఉండదు. అవును, నవ్వితే ఎక్కడ తమ పళ్ళు బయటకి కనిపించి ఎదుటివారి దృష్టిలో అవమానం పొందాల్సి వస్తుందో అని చెప్పి నవ్వడమే మానేస్తారు. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, పళ్ళలో పాచి పేరుకుపోవడం మొదలగు కారణాల వల్ల నవ్వడం మానేసిన వాళ్ళు చాలా మంది.

మరి ఈ సమస్యను అధిగమించేదెలా? అందమైన నవ్వుని తిరిగి పొందేదెలా? నోరు శుభ్రంగా ఉంచుకోవడమనేది ముఖ్యమైన ప్రక్రియ. పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని సరిగ్గా శుభ్రపరచాలి. లేదంటే మనం తిన్న ఆహారం అందులో ఇరుక్కుని ఉండడం వల్ల దానిపై సూక్ష్మక్రిములు పెరుగుతాయి. అవి పెరిగి పెరిగి చివరికి దంతాలని తినడం ప్రారంభిస్తాయి. అలా తింటూ పోతుంటే ఏదో ఒక రోజు చిగుళ్ళ నుండి దంత విడివడి ఊడిపోయే అవకాశం ఉంది. పళ్ళు తొందరగా ఊడిపోవడానికి ముఖ్యకారణం ఏదైనా ఉందంటే అది ఇదే.

సూక్ష్మ క్రిముల వల్ల పళ్ళు ఊడిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే పళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి. మీ దంతాల్లో సూక్ష్మ క్రిములు పేరుకుపోయి ఇబ్బందిగా ఉంటే ఈ కింది పనులు చేయండి. సున్నం తీసుకుని దానికి కొంత పటిక జోడించి మంచి పేస్ట్ లాగా తయారు చేసి రోజూ బ్రష్ చేయండి. ఇలా రోజూ బ్రష్ చేస్తుంటే పళ్ళలో పేరుకుపోయిన సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి. సూక్ష్మ క్రిముల వల్ల వికారంగా కనిపించే మీ దంతాలు తెల్లగా తళతళ మెరుస్తాయి. ఇలా రోజూ రెండుపూటల చేస్తే చాలు. మిల మిల మెరిసే ముత్యాల్లాంటి దంతాలు మీ సొంతం.

Read more RELATED
Recommended to you

Exit mobile version