చాలా మందికి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. దీని కోసం వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కోసం మందులు వాడకుండా ఇంట్లోనే చిట్కాలు ఉపయోగించి తగ్గించుకోవచ్చు. మీకు తరచుగా మైగ్రేన్ తలనొప్పి వస్తుందా…? అయితే తప్పకుండా దీని వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
ధ్రువ గడ్డి :
ఇది చాలా మంచిది. నొప్పిని ఇది బాగా తగ్గిస్తుంది. గరికను ఉపయోగించడం వల్ల మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోతుంది. దీని కోసం ఒక గుప్పెడు గరిక తీసుకుని మిక్సీ లో వేసి బ్లెండ్ చేయండి. దీనిలో కొంచెం ములేతి పొడిని వేసి కలపండి. దీనిని మీరు మధ్యాహ్నం పూట తీసుకోండి. మీరు తరచుగా దీనిని తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ గడ్డి మనకి రోడ్డు పక్కన కనబడుతూనే ఉంటుంది. పూజ లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.
ఎండు ద్రాక్ష మరియు బాదం:
మైగ్రేన్ తో సతమతమయ్యే వాళ్ళు 7 నుండి 8 ఎండు ద్రాక్ష మరియు బాదం రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపు తో తినాలి. ఇలా చేస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.
ధనియాల పొడి:
అలానే ధనియాలని ఎండ పెట్టి దానిని పొడి చేయండి. ఆ పొడిని ఒక కప్పు నీటి లో రాత్రి నానబెట్టండి. ఆ నీటిని ఉదయాన్నే తాగేయండి. మీకు కావాలంటే దీంట్లో పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.
ఇప్పుడు మనం ఉండే జీవన విధానమే అనేక సమస్యలకు దారి తీస్తోంది. మైగ్రేన్ నుంచి బయట పడాలంటే కూడా మీ జీవన విధానం లో మార్పులు చేసుకోవాలి. జంక్ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించాలి. టీ, కాఫీ అలవాటు మానుకోవాలి. చాలా మందిలో తీవ్రమైన తల నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. ఎక్కువగా మహిళలుకి వస్తూ ఉంటుంది.