బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ టిప్స్​ పాటించండి..!

-

బరువు పెరగడం అనేది.. మనలో టెన్షన్ ను పెంచి.. మనఃశాంతిని దూరం చేస్తుంది. కలిసిన వారంతా.. మొదట అనే మాట.. ఈ మధ్య కొంచెం లావు అయ్యావ్ అని.. అలా చెప్పగానే.. మనసులో కలుక్కుమని ఏదో గుచ్చినట్లే అవుతుంది. వెంటనే ఏం చేసి అయినా సరే.. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాం.. కానీ కాసేపటికే మళ్లీ మామూలే. ఏం చేస్తాం.. అన్ని పనులు ఉన్నాయి.. బీజీ లైఫ్ లో బెల్లీ ఫ్యాట్ కూడా భాగమైంది. కానీ మన జీవితంలో మనకే టైం లేకపోతే ఎలా..? అధిక బరువు అనేది ఎన్నో రోగాలకు గ్రీన్ సిగ్నెల్ లాంటిది.. కాబట్టి. ఇప్పుడిప్పుడే పెరిగే బరువును.. కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఆవాల నూనె మీ ఆహారంలో ఉంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందట.

ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటి పనిగా గోరువెచ్చని నీరు తాగాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు.. కాబట్టి..పసుపు టీ తాగవచ్చు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అవి కడుపులోని టాక్సిన్‌లను సులువుగా బయటకు పంపడానికి, మిమ్మల్ని రిఫ్రెష్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ టీకి కొద్దిగా నిమ్మరసం, నిమ్మ తొక్కను జోడించడం వలన మీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మరింత మెరుగుపడతాయి. బరువు తగ్గడానికి ఈ టీ ఉత్తమ పరిష్కారం.

ఆవాల నూనెకు జీవక్రియను వేగవంతం చేసే గొప్ప గుణం ఉంది. ప్రధానంగా నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో ఇది ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ ప్రక్రియ బరువు తగ్గడానికి మేలవుతుంది. చాలా మంది ఆవ నూనె అనగానే.. అబ్బో జిడ్డూ, ఒకరకమైన వాసన అంటారు.. ఈ కారణాల వల్లే ఈ ఆయిల్ ను వాడరు. కానీ ఒకసారి సరిగ్గా వేడి చేస్తే ఆవ నూనె కూడా ఇతర నూనెల లాగే ఉంటుంది. ఈ నూనె ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు మరియు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. రక్తంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు శరీరంలో సహజంగా నిల్వ ఉన్న కొవ్వు వినియోగాన్ని మెరుగు పరుస్తాయి, ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మీరు వంటలు ఈ నూనెతో చేసుకుంటే.. చాలా మంచిది. ఇంకా దీంతో పాటు.. ఆవనూనెను వేడి చేసి.. బెల్లీ ఫ్యాట్ మీద రాసి.. మసాజ్ చేస్తుంటే.. పొట్ట ఆ లూస్ అంతా పోయి బిగుసుకుంటుంది. ఆవనూనెను బాడీ పెయిన్స్ కు కూడా చక్కటి పరిష్కారంగా వాడుకోవచ్చు. ఇందులో కాస్త ముద్దకర్పూరం వేసి.. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎక్కడ ఎలాంటి నొప్పులు ఉన్నా.. వేడిచేసి రాసి.. మసాజ్ చేసి.. పది నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీటితో కాపడం పెట్టారంటే.. చేత్తో నొప్పిని తీసేసినట్లే పోతుంది. కాబట్టి అందరి ఇళ్లలో ఆవనూనె కచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version