తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.ఈ నెల 26న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది. కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ దవాఖాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆసుపత్రుల వివరాలు…..
ఒక్కో దవాఖానను 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం .
ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు ఏర్పాటు.
వైద్య విద్య కోసం అందుబాటులోకి పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు
అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు
1) అల్వాల్
మొత్తం విస్తీర్ణం: 28.41 ఎకరాలు
ఎత్తు: జీ+5
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.897 కోట్లు
2) ఎల్బీనగర్
మొత్తం విస్తీర్ణం: 21.36 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.900 కోట్లు
3) సనత్ నగర్..
మొత్తం విస్తీర్ణం: 17 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.882 కోట్లు