తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. ఈరోజు సమావేశం అయిన అసెంబ్లీ నాలుగు చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆ నాలుగు బిల్స్ ఇలా ఉన్నాయి. 1. ఇండియన్ స్టాంప్ బిల్, 2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ బిల్ , 3. జిహెచ్ఎంసి సవరణ బిల్లు , 4, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
ఇక జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం ఐదు సవరణలు చేసింది. ఈ బిల్లును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇక జీహెచ్‌ఎంసీ చట్టంలో బీసీల రిజర్వేషన్ యథాతథంగా ఉందని, ఇందులో ఎలాంటి మార్పూ చేయలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఆర్టికల్ 243 -టీ ప్రకారం 33.333 శాతం బీసీ రిజర్వేషన్లను డిస్టబ్ చేయలేదని చెప్పారు.