హుజురాబాద్ నియోజక వర్గ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ల లో రిజర్వేషన్స్ వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఖమ్మం జిల్లా కు చెందిన వ్యక్తి హై కోర్టు లో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ లో కులాల ప్రాతి పదికన రిజర్వేషన్స్ ఉండకూడదు అని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను పిటిషన్ దారు గుర్తు చేశారు.
అయితే ఈ పిటిషన్ ఈ రోజు తెలంగాణ హై కోర్టు విచారించింది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు విషయం లో ఏ ప్రాతి పదికన నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హై కోర్టు ప్రశ్నించింది. దీని పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హై కోర్టు ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్ విచారణ ను ఎల్లుండి కి హై కోర్టు వాయిదా వేసింది. అయితే మద్యం దుకాణాల కేటాయింపు లో గౌడ్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్ల ను కేటాయించింది.