మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సైబర్‌ ల్యాబ్‌

-

తెలంగాణలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ గొప్ప ముందడుగు వేసింది. మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, నేర పరిశోధన కోసం ప్రత్యేకంగా సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ సైబర్‌ ల్యాబ్‌ మరో నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని రాష్ట్ర మహిళా భద్రతా విభాగ కార్యాలయంలోని మూడో ఫ్లోర్ లో ఈ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసారు.

సైబర్‌ ల్యాబ్‌ /Cyber Lab

సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు కోసం సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌)తో తెలంగాణ మహిళా భద్రతా విభాగం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాగా దేశంలో డిజిటల్‌ నేరాల దర్యాప్తునకు బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌ఎండీ)తో కలిసి సీఆర్‌సీఐడీఎఫ్‌ పనిచేస్తున్న విషయం తెల్సిందే. సైబర్‌ నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక టూల్స్‌, ఇతర సాంకేతిక అంశాలపై సీఆర్‌సీఐడీఎఫ్‌ సహకారం అందించనుంది.

మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు అందిపుచ్చుకోవాల్సిన టెక్నాలజీ, అలవర్చుకోవాల్సిన మెళకువలు తదితర అంశాలను ఈ సైబర్‌ ల్యాబ్‌ ద్వారా షీటీమ్స్‌, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లు, సైబర్‌ క్రైం దర్యాప్తు బృందాలకు నేర్పనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా మహిళలు, చిన్నారులను ట్రాఫికింగ్‌ చేసే ముఠాలు, చిన్నారులను నేరాల్లోకి దింపేందుకు యత్నించే ముఠాలు, పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లపై డేగకన్ను వేసి అసాంఘిక శక్తుల ఆకట్టించేందుకు అవసరమైన సరికొత్త టూల్స్‌ను సైబర్‌ ల్యాబ్‌ అందిస్తుంది. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులకు మరింత భద్రత కల్పించేందుకు ఈ ల్యాబ్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లా పనిచేస్తుందని మహిళా భద్రతా విభాగ డీఐజీ సుమతి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version