ప్రైవేటు బంకులకు ఆర్టీసీ బస్సులు.. ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం

-

టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రైవేటు బంకుల్లో డిజిల్ కొట్టించుకేనేలా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రైవేటు పెట్రోల్ బంకుల్లో టీఆఎస్ ఆర్టీసీ బస్సులు క్యూ కడుతున్నాయి. గతంలోె లీటర్ డిజిల్ పై రూ. 7 సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం .. ఈనెల 16 నుంచి సబ్సిడీని ఎత్తివేయడంతో డిజిల్ కొనలేని పరిస్థితిలో ఆర్టీసీ యాజమన్యం ఉంది. దీంతో ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రైవేటు బంకుల్లో డిజిల్ కొనుగోలు చేస్తున్నారు. 

ఇదివరకు ఆర్టీసీకి ఆయిల్ కంపెనీలతో నేరుగా ఒప్పందం ఉండేది. డిజిల్ రేట్లపై సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చేది.. అయితే సబ్సిడీని ఎత్తేయడంతో డిజిల్ రేట్లు పెరిగాయి. ఈ పెరిగిన భారం ఆర్టీసీ ఆదాయం పడుతోంది. రోజకు కొన్ని లక్షల రూపాయలు అదనంగా డిజిల్ కే చెల్లించాల్సి వస్తోంది. దీని కన్నా బహిరంగా మార్కెట్ లో ప్రైవేటు బంకుల్లోనే డిజిల్ రేట్లు తక్కువగా ఉండటంతో ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి డిజిల్ రేట్లు గుదిబండగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version