కమలహాసన్ – శ్రీదేవి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?

-

ఏ ఇండస్ట్రీలో నైనా కొన్ని జంటలు బాగా ఎలాంటి సినిమా తీసినా కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటలు మన టాలీవుడ్లో చాలానే ఉన్నాయి అని చెప్పవచ్చు. అలా వెండితెరను ఒక వెలుగు వెలిగిన నటులలో కమలహాసన్ , అతిలోకసుందరి శ్రీదేవి జంట కూడా ఒకటని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆకలి రాజ్యం, ఓ రాధా ఇద్దరు కృష్ణులు, వసంత కోకిల వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ చిత్రాలలో వీరిద్దరి రొమాన్స్ కు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.

ఇక తమిళనాడులో అయితే ఈ జంటకు ఒక సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదేవిధంగా బాలీవుడ్ లో కూడా కలిసి నటించి బాగా అలరించారు. దీంతో వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుంది అని పలువురు అభిమానులు సైతం భావించే వారట. ఇక ఇలాంటి విషయాలకు తగ్గట్టుగానే శ్రీదేవి కుటుంబంతో కమలహాసన్ కూడా చాలా సన్నిహితంగా ఉండేవారట. తమ కుటుంబంతో సన్నిహితం ఉండడం వల్ల స్వయంగా శ్రీదేవి తల్లి కమల్ హాసన్ ను తన కూతురిని వివాహం చేసుకోవాలని కోరిందట. కానీ శ్రీదేవి తోబుట్టువుల భావించేవాడిని.. అందుకే ఆమెను వివాహం చేసుకోలేదని ఆమె తల్లితో చెప్పేసారట. ఈ విషయాన్ని స్వయంగా తన డైరీలో రాసుకున్నట్లు కమలహాసన్ సమాచారం.

ఇక శ్రీదేవికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ రాసిన బుక్కులో ఒక నోట్ లో ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాకుండా తాను అంటే శ్రీదేవికి చాలా గౌరవం అని కమలహాసన్ తెలియజేశారు. తాను చనిపోయేదాకా శ్రీదేవి సార్ అని పిలుస్తూ ఉండేదని కమల్ హాసన్ తెలిపారు. ఇక ఇప్పటికి వీరి కాంబినేషన్లో తెరకెక్కించిన పలు చిత్రాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ని సాధిస్తూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version