బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

-

బస్సు ప్రయాణికుల కష్టాలు తొలగించేందుకు టీఎస్ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త యాప్ ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ప్రారంభించారు. బస్సు ట్రాకింగ్ యాప్ గమ్యం పేరుతో దీన్ని రూపొందించారు. దీనిలో ప్రయాణికుడు ఉన్న ప్రాంతానికి బస్సు ఇంకా ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. స్టాప్ల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయని, అలాగే మహిళల కోసం ప్రత్యేక సదుపాయాన్ని కల్పించామన్నారు.

అలాగే ఈ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేక సదుపాయాన్ని కలిపించారు. బస్ స్టాప్లు లేని దగ్గర ఫ్లాగ్ బస్ ఆప్షన్‌తో మహిళలు బస్సు ఎక్కే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఎ బస్ ఆప్షన్ అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు యాప్‌ను రూపొందించారు. ఈ కొత్త యాప్‌తో బస్ ట్రాకింగ్, దగ్గరలోని బస్సు ఎక్కడుంది, బస్ స్టాప్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version