తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 29వ రోజు కొనసాగుతోంది. తమ 26 డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో 48వేల మంది కార్మికులు 29 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇక ఇవాళ అన్ని డిపోల వద్ద జేఏసీ పిలుపు మేరకు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు విపక్ష పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 30 కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆర్టీసీ పాలసీని సమూలంగా మార్చే విధంగా కేబినెట్ నిర్ణయం ఉండబోతోందని తెలుస్తోంది. ప్రైవేటు బస్సులు, ప్రైవేట్ రూట్లపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.