టీటీడీ బోర్డు మెంబర్ తిట్ల దండకం.. రంగంలోకి విజిలెన్స్ అధికారులు

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న నిబంధనలు పాటించాలని చెప్పినందుకు టీటీడీ ఉద్యోగిని బోర్డు మెంబర్ నరేష్ ఇష్టానుసారంగా బూతులు తిట్టిన విషయం తెలిసిందే. రూల్స్ పాటించి బోర్డు మెంబర్‌ను బయటకు వెళ్లాలని చెప్పినందుకు టీటీడీ ఉద్యోగిని “ఎవ‌డ్రా నువ్వు…పోరా బ‌య‌టికి.. థ‌ర్డ్ క్లాస్ నా కొడ‌కా…ఫ‌స్ట్ బ‌య‌టికి పంపండి.

లేకుంటే ఇక్క‌డే కూర్చుంటా” అంటూ శ్రీవారి గుడి ప్రాంగణంలోనే తిట్ల దండకం మొదలెట్టిన బోర్డు మెంబర్.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా..విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ముందుగా టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేశారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు విజిలెన్స్ శాఖ పంపించింది. సభ్యుడి దురుసు వ్యవహారంపై సీఎంఓ ఆరా తీసినట్లు తెలిసింది. తదుపరి చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version