తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల కొండపైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తామని తెలిపింది.
అలిపిరి నడక మార్గంలో 10 వేల టికెట్లు జారీ చేయనుంది టీటీడీ. శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల టికెట్లు జారీ చేయనుంది టీటీడీ. రోజు వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నామని పేర్కొంది.