తిరుమళ భక్తులకు అలర్ఠ్..వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన చేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన ప్రకారం….. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు లభ్యం అవుతాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.
జనవరి 8న సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇక అటు… తిరుమలలో జనవరి 10 నుంచి 19 వ తేది వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో 1 కౌంటర్ ద్వారా టోకెన్లు జారి చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు జనవరి 8వ తేదీన జారి చేసే అవకాశం ఉంది. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.