ఎమర్జింగ్ ఆసియా కప్ సెమీఫైనల్ 2 లో ఓటమి కోరల్లో చిక్కుకున్న ఇండియా అద్భుతంగా పుంజుకుని బంగ్లాదేశ్ పై 51 పరుగుల తేడాతో గెలిచి పాకిస్తాన్ తో తుది సమరానికి సిద్ధం అయింది. ఇండియా నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మొదట్లో జోరుగా ఆడిన బంగ్లా .. 20 ఓవర్ ల తర్వాత స్లో అయింది. ఓపెనర్లు ఇద్దరూ మినహాయిస్తే మరెవ్వరూ ఆశించిన రీతిలో ఆడలేకపోయారు. పిచ్ మీద ఉన్న టర్న్ ను చక్కగా ఉపయోగించుకున్న ఇండియా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ నిశాంత్ సింధు బంగ్లాను తన స్పిన్ మాయలో చిక్కుకునేలా చేశాడు. ఇతను 8 ఓవర్లు బౌలింగ్ చేసి పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక మైన వికెట్లను తీసుకున్నాడు. ఒకదశలో ఇండియా ఓటమి తప్పదు అనుకుంటే.. సింధు తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి ఇండియాకు ఊహించలేని విజయాన్ని అందించాడు.
IND A VS BAN A : నిషాంత్ సింధు మాయాజాలం … 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు !
-