తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. మలయప్ప స్వామి శ్రీ వెంకటేశ్వర ఆలయ సన్నిధి వద్ద అధికంగా భక్తుల రద్దీ నెలకొంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నడక దారిన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. నిన్న స్వామివారిని 77,893 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు వర్షాలు కురవడం తగ్గిన తర్వాతనే స్వామివారి దర్శనం కోసం తిరుమలకు రావాలని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలను చేపడుతున్నారు.