విశాఖ ఉక్కు కోసం ఉవ్వెత్తున నిరసనలు.. కేంద్రంపై ఆగ్రహం

-

విశాఖ ఉక్కుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని స్టీల్ కంపెనీలు ఉద్యోగులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు రోడ్డుపైకి వచ్చారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై కన్సల్టెంట్‌ నియామకానికి విడుదల చేసిన నోటిఫికేషన్‌‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను అడ్డునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ, వైసీపీ అధిష్టానం స్పందించాలని, లేదంటూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. సీఎం జగన్, చంద్రబాబుతో పాటు పవన్ కూడా స్పందించి.. కేంద్రప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నారు.

కాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై కేంద్రం కీలక అడుగులు వేసింది. కన్సల్టెంట్‌ నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్మకానికి పెట్టింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మేందుకు మరో అడుగు ముందుకేసింది. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ సమర్పించాలని నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా లీల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్స్ అడ్వైజర్ల కోసం బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. ఈనెల 15న కేంద్రం ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ నెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని విశాఖ వాసులు తప్పుబడుతున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని వినిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version