యాతాలకుంట గ్రామం లో సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ చేసారు. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలు ఇవ్వడానికి సీతారామ ప్రాజెక్ట్ తలపెట్టిందన్నారు. అలానే 7 వేలకోట్ల కు పైగా ఖర్చు చేసినట్టు చెప్పారు. టన్నెల్ రెండు వైపుల నుండి కూడా పనులు చేసి పూర్తి చేయాలని చెప్పారు.
అలానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నారు అని చెప్పారు. గండుగలు పల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. అలానే యాతలకుంట టన్నెల్ పూర్తయితే బెత్తుపల్లి, లంకా సాగర్ కి నీళ్లు వెళ్తాయి అని అన్నారు. గండుగలు పల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నట్టు కూడా చెప్పారు.
యాతాల కుంట టన్నెల్ ప్రధానమైంది అన్నారు.