కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2019 డిసెంబర్ నెలలో చైనాలో విజృంభించిన కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను కోల్పోయారు. కాస్త తగ్గుముఖం పట్టిందనుకునే సమయంలోనే మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా వేరియంట్లు చైనాలో రకరకాలుగా వ్యాపిస్తోంది.
తాజాగా భారత్ లోకి కూడా ప్రవేశించింది. ఈ మధ్య కాలంలో రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారిపై WHO కీలక ప్రటన చేసింది. కరోనా ఇంకా ప్రమాదకరంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత నెలలో సుమారు 10వేల మంది మరణించారని ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. కరోనా కేసులు నమోదు, మరణాల తీవ్రత బయటికి తెలియడం లేదన్నారు. గత ఏడాది నవంబర్ తో పోల్చితే.. డిసెంబర్ లో 42 శాతం మంది ఎక్కువగా ఆసుపత్రి పాలయ్యారని.. 62 శాతం మంది ఐసీయూలో చేరారని తెలిపారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని.. వ్యాక్సినేషన్ వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.