Breaking : హైకోర్టును ఆశ్రయించిన కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌

-

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజకీయ అజెండా మేరకే సిట్‌ దర్యాప్తు చేస్తోందని తుషార్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 21న విచారణకు రావాలని 16న 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారన్నారు. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ మెయిల్‌ చేసినట్లు చెప్పారు. అయితే, తన మెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా లుకౌట్‌ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని పిటిషన్‌లో తుషార్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) బీజేపీ ముఖ్యనేత బీఎల్‌ సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్‌, అడ్వకేట్‌ శ్రీనివాస్‌ పాత్రను నిగ్గుతేల్చేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తోంది. అయితే, ఇప్పటివరకు శ్రీనివాస్‌ ఒక్కరే సిట్‌ విచారణకు హాజరుకాగా.. జగ్గుస్వామి, తుషార్‌పై లుక్‌అవుట్‌ నోటీస్‌ ఇష్యూ చేసింది సిట్. బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి ఊరట పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది. తుషార్‌ అండ్‌ జగ్గుస్వామిని ఇంటరాగేట్‌ చేస్తే కీలక ఆధారాలు, సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు అధికారులు. ఈ ఇద్దరే ఈ కేసులో కీ పర్సన్స్‌గా భావిస్తోంది సిట్‌. బేరసారాల వెనకున్న పెద్దలకు మీడియేటర్స్‌గా జగ్గుస్వామి, తుషార్‌ ఉన్నారని అనుమానిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version