హుజూరబాద్ లో బీజేపీ కోసం 20 మంది స్టార్ క్యాంపెయినర్ లు..!

-

హుజరాబాద్ ఉప ఎన్నికల వేడి మరింత పెరిగిపోయింది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేసీఆర్ సర్కారు పై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. టిఆర్ఎస్ నుండి హరీష్ రావు గెల్లు శ్రీను తరపున ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తమ స్టార్ క్యాంపెయినర్ ల జాబితా ను ప్రకటించింది. ఇక తాజాగా బీజేపీ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ లను ప్రకటించింది.

etela

కాగా బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం లో బండి సంజయ్ తో పాటూ…కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, విజయ శాంతి, తరుణ్ చుగ్, డికే అరుణ, ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ రఘునందన్ రావు, లక్ష్మణ్, మురళీధరరావు, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి లు ఉన్నారు. ఇదిలా ఉంటే బిజేపి స్టార్ క్యాంపెయినర్ ల లిస్ట్ లో శాసనసభ పక్ష నేత రాజాసింగ్ మరియు ఎంపీ సోయం బాపూరావు పేర్లను జాబితాలో చేర్చకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రభుత్వంపై విమర్శలు కురిపించే వారిలో రాజాసింగ్ ఉంటారు. ఇప్పుడు ఆయన పేరును లిస్ట్ లో చేర్చక పోవడం చర్చగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version