ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా అంశం బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకాలం తన పని తాను చేసుకుని వెళ్లిపోతున్న రాధా…ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాలని తనవైపు తిప్పేసుకున్నారు. ఇప్పుడు రాధా మాట్లాడిన మాటలపైనే పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా రాధా..తనని చంపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, రెక్కీ కూడా నిర్వహించారని చెప్పి స్వయంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలోనే మాట్లాడారు.
రాధా మాటలపై టీడీపీ వర్షన్ ఒకలా ఉంది. ప్రస్తుతానికి రాధా టీడీపీలోనే ఉన్నారు…కానీ పార్టీలో యాక్టివ్గా పనిచేయడం లేదు. సొంత కార్యక్రమాలే చూసుకుంటున్నారు. అయితే రాధాని వైసీపీలోకి తీసుకెళ్లడానికి కొడాలి, వంశీలు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఎలాగైనా ఆయనని వైసీపీలోకి తీసుకెళ్లడానికి చర్చలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో ఈ విధమైన గేమ్ కూడా మొదలుపెట్టి ఉంటారని డౌట్ పడుతున్నారు. రాధా ద్వారా కాపుల మద్ధతు తీసుకోవడానికి వైసీపీ ఆడుతున్న డ్రామా అని అంటున్నారు.
ఎలాగో పవన్, టీడీపీతో కలిసి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో కాపులు మద్ధతు టీడీపీకి వెళుతుంది. ఈ క్రమంలోనే కాపుల ఓట్లలో చీలిక తీసుకురావడానికి కొడాలి, వంశీలు…రాధాని ట్రాప్ చేశారని, వారి ట్రాప్లో రాధా పడకూడదని మాట్లాడుతున్నారు. కావాలంటే జనసేనలో చేరండి గానీ, వైసీపీ మాత్రం చెరోద్దని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. మరి చూడాలి రాధా ఈ అంశాలపై ఎలా స్పందిస్తారో?