ట్విట‌ర్ పోల్ : ఆర్ఆర్ఆర్ ఓ సామాన్యుడి స‌త్తా ? ఎనీ డౌట్స్

-

మాట్లాడుతూ మాట్లాడుతూ
ఆగిపోవ‌డం మౌనం
మాట్లాడుతూ మాట్లాడుతూ
యుద్ధ రీతికి స‌న్న‌ద్ధం కావ‌డం వ్యూహం
మౌనం క‌న్నా వ్యూహం గొప్ప‌ది..
వ్యూహాత్మ‌కత తో కూడిన తెలివి
ఇంకా గొప్ప‌ది.. తొక్కుకుంటూ పోవాలె…

యుద్ధ కాంక్ష క‌న్నా విముక్తి ఒక‌టి కోరుకోవాలి
విముక్తం అయినప్పుడు కూడా కొన్ని కార‌ణాలు
కొన్ని స‌మస్యలు వెన్నాడుతూ ఉంటాయి
యుద్ధం విముక్తి కోసం వ్యూహం స్వేచ్ఛ కోసం

నేల పొర‌ల్లో దాగి ఉన్న వీర‌త్వం అంటే ఎలా ఉంటుంది
విప్ల‌వ‌మే కానీ నేల సూరీడును దాచుకుంది
నేల విస్ఫోట‌నాల‌ను పంచుకుంది
భ‌ర‌త జాతి వీళ్ల‌కు రుణ‌ప‌డి పోయాక మ‌నం క‌ళ్లు తెరిచాం
మ‌న క‌న్ను ముశాక కూడా రెప్ప‌వేయ‌ని దీక్ష ఒక‌టి
ఈ జాతిని ర‌క్షిస్తుంది.. మేరా భారత్ మ‌హాన్

యుద్ధం శబ్ద సంబంధం అయి ఉంది
ర‌ణ‌గొణ ధ్వ‌నుల నుంచి ఒక ఉత్తేజం ఉర‌కలెత్తింది
అడ‌వికి నేర్పిన పాఠం విప్లవం
అడవి నుంచి తీసుకున్న సారం చైతన్యం
చైత‌న్యం నుంచి విప్ల‌వం వ‌ర‌కూ రౌద్రం ర‌ణం రుధిరం
ఇది సామాన్యుడి స‌త్తా..
– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Exit mobile version